జార్జిరెడ్డి సినిమాపై ఏబీవీపీ సైలెంట్...? - Tolivelugu

జార్జిరెడ్డి సినిమాపై ఏబీవీపీ సైలెంట్…?

Why Abvp Leaders Not Responding On George Reddy Movie, జార్జిరెడ్డి సినిమాపై ఏబీవీపీ సైలెంట్…?

జార్జిరెడ్డి సినిమా ట్రైలర్‌ ఏ సమయంలో విడుదలైందో కానీ అప్పటి నుండి ఓ వైపు పొగడ్తలు, మరోవైపు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. జార్జిరెడ్డి హత్యపై ఏబీవీపీ ఒకట్రెండు రోజులు కాస్త హడావిడి చేసి మౌనంగా ఉండిపోయింది. బీజేపీ, అనుబంద సంఘాలు కూడా మౌనంగానే ఉంటున్నాయి.

అయితే, జార్జిరెడ్డి సినిమాపై ఏబీవీపీకి పార్టీ నుండే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే గొడవ చేయడమంటే… ఏబీవీపీ ఎందుకు ఉలిక్కిపడుతున్నట్లు అనేది చర్చనీయాంశం అవుతుంది. సినిమాలో ఆ అంశాన్ని పెట్టామా లేదా అనేది తెలియకుండా ముందే మనం ఎందుకు రచ్చ చేయటం అంటూ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకే ఏబీవీపీ నేతలు రెండ్రోజులుగా మౌన ముద్ర వేశారని ప్రచారం సాగుతోంది.

జార్జిరెడ్డి సినిమా నవంబర్‌ 22న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp