ఐఫోన్ కొనడం అనేది చాలా మందికి ఒక కల. అందుకే ఐఫోన్ కోసం కిడ్నీ లు అమ్ముకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అది సరే గాని అసలు ఐఫోన్ ధర లేదా యాపిల్ ఉత్పత్తుల ధరలు ఎందుకు అంత ఎక్కువగా ఉంటాయి…? యాపిల్ ఉత్పత్తుల ధర ప్రభావం చూపించే కీలక అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:పేపర్ టైట్.. అయాం వెయిటింగ్..!
యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా సరే తయారు చేసిన తర్వాత దాన్ని అనేక విధాలుగా పరీక్షిస్తారు. వాతావరణం నుంచి దాని గట్టిదనం వరకు ఎన్నో పరిక్షలు ఉంటాయి. అలాగే సాఫ్ట్ వేర్ హ్యాక్ అవుతుందా లేదా అనే దాని మీద కూడా అనేక రకాల పరిక్షలు ఉంటాయి. అందులో వాడే ప్రతీ అప్లికేషన్ ను పూర్తి స్థాయిలో పరిక్షించిన తర్వాతనే ప్రోడక్ట్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది యాపిల్.
సాఫ్ట్ వేర్ తయారి విషయంలో కూడా యాపిల్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ నుంచి నేటి అధినేత టీం కుక్ వరకు ప్రతీ ఒక్కరు కూడా యాపిల్ ఉత్పత్తుల విషయంలో సాఫ్ట్ వేర్ ను సీరియస్ గా తీసుకుని విడుదల చేస్తారు. యాపిల్ లో పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల వేతనాలు కూడా చాల ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ లు ఇలా చాల విషయాలపై వారు ఖర్చు చేస్తూ ఉంటారు.
సాఫ్ట్వేర్ ద్వార ఇతర మార్గాల ద్వార అంటే యాడ్స్ , సాఫ్ట్వేర్ ఓస్ అమ్మకాలు యాపిల్ లో ఎక్కువగా జరగడం లేదు. ప్రోడక్ట్ ఖరీదు ఎక్కువ ఉన్నపుడు ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త ప్రొడక్ట్స్ రావాలంటే ఆ దశలో పేటెంట్లు చాలా కీలకంగా ఉంటాయి. యాపిల్ దగ్గర ఉన్న పేటెంట్స్ కోసం ఎక్కువ ధరనే ఖర్చు చేస్తూ ఉంటారు. యాపిల్ సంస్థ వద్ద రెండు వేల వరకు పేటెంట్ లు ఉన్నాయి. ఇక ప్రమోషన్ విషయంలో కూడా యాపిల్ చాలా ఖర్చు చేస్తుంది. సంస్థ విలువ పెద్దది కాబట్టి ప్రచారం విషయంలో కూడా పెద్ద సంస్తలనే ఎంచుకుంటుంది.
Also Read:ఇల్లిస్తానని ఆశపెట్టి.. ఇప్పుడు చావమంటున్నావా కేసీఆర్..?