క్రికెట్ లోకి ఐపిఎల్ అడుగు పెట్టిన తర్వాత క్రికెట్ గతే మారిపోయింది అనే మాట వాస్తవం. క్రికెట్ ను పూర్తిగా వ్యాపారంగా మార్చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి. కొందరి ఆటగాళ్ళ వ్యవహారశైలి దీనికి ఊతం ఇస్తుంది. దేశం కంటే ఐపిఎల్ కు ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుంది. వెస్టిండీస్ క్రికెట్ ఇలాగే నాశనం కాగా మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.
ఇప్పుడు మన టీంలో కూడా కొందరి వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా జట్టు ప్రధాన బౌలర్ గా ఉన్న బూమ్రా జట్టు కంటే ఐపిఎల్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. త్వరలో మొదలయ్యే టి 20 ప్రపంచకప్ నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. అతను ఇలా మెయిన్ లీగ్స్ నుంచి తప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆసియా కప్ నుంచి కూడా తప్పుకున్నాడు.
ఇక ఇప్పటి వరకు గాయాలతో 68 అంతర్జాతీయ టి20లు, 49 వన్డేలు, 14 టెస్ట్ మ్యాచ్ లు ఆడలేదు. ఒక్క ఐపిఎల్ మ్యాచ్ మాత్రమే గాయం కారణంగా తప్పుకున్నాడు. దీనితో బూమ్రా కమర్షియల్ ఆటగాడు అని, అతనికి దేశం కంటే ప్రీమియర్ లీగ్ ముఖ్యమని ఆరోపణలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరుపున అతను ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యాపై సైతం ఇవే విమర్శలు ఉన్నాయి.