గోదావరి నది అనగానే… చాలా మంది సిని ప్రియులకు అక్కడ జరిగే సినిమా షూటింగ్ లు కళ్ళ ముందు ఉంటాయి. అసలు గోదావరి నదీ తీరంలో జరిగినన్ని షూటింగ్ లో మరే నదీ తీరంలో కూడా జరగలేదు అనే మాట వాస్తవం. అసలు ఎందుకు సినిమా వాళ్లకు గోదావరి నది అంతగా నచ్చుతుంది అనేది ఒకసారి చూద్దాం.
గోదావరి నది మహారాష్ట్ర లోని నాసిక్ నుండి బంగాళాఖాతం సుమారు 1500 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్ననది. రాజమండ్రి నుండి పాపి కొండల వరకు వున్న సుమారు 230 కిలోమీటర్ల భాగంలో సినిమాలకు మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. పట్టిసీమ ప్రాంతంలో ఎక్కువగా సినిమాలను షూట్ చేసారు. ఈ భాగంలో గోదావరి నది వెడల్పుగా అదే విధంగా లోతైన నదిగా ఉంటుంది. సంవత్సరంలో చాలా వరకు బోటింగ్ కు అనుకూలంగా నీటి ప్రవాహం ఉంటుంది.
రాజమండ్రిలో నదిపై ఉన్న పొడవాటి (సుమారు 3 కిలోమీటర్లు) రైల్వే బ్రిడ్జులు, పొడవాటి ఘాట్ లు, ఆ ఘాట్లలో దేవాలయాలు… సినిమా దర్శక నిర్మాతలను ఆకట్టుకున్నాయి. ప్రకృతి అందాలు – నదిలో ఏర్పడే దీవులు/లంకలు/ఇసుక దిబ్బలు, నదికి రెండువైపులా పర్వతాలు; పట్టిసీమ వద్ద నది మధ్యలో వున్న గుట్టపై వున్న దేవాలయం కూడా సినిమా షూటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. షూటింగ్ కోసం వచ్చే వాళ్లకు అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల అందాలు కూడా సినిమా షూటింగ్ లకు బాగా కలిసి వస్తాయి.