అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే క్రికెట్ కు మంచి గుర్తింపు ఉంది. 50 ఓవర్ల పాటు సాగే ఈ ఆటలో ఎవరి ఆధిపత్యం ఉంటుంది అనే దానిపై అందరూ ఆసక్తికరంగానే చూస్తారు. క్రికెట్ లో టెస్ట్ క్రికెట్ తర్వాత ఒకప్పుడు మంచి ఆదరణ ఉన్న గేమ్ ఇది. సరే గాని ఒకప్పుడు 250 కొట్టాలి అంటే చాలా కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు మాత్రం 300 పైన స్కోర్ లు ఎక్కువగా కొడుతున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.
Also Read:లాప్రో స్కోపీ అంటే ఏంటీ…? గతంలో మత్తు కోసం ఏం ఇచ్చే వారు…?
పవర్ ప్లే: పవర్ ప్లే కారణంగా స్కోర్ లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. బ్యాటింగ్ పవర్ ప్లే లో ఫీల్డర్ లు 30 గజాల సర్కిల్ లో నిలబడుతున్నారు. బయట ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. దీనితో బ్యాటింగ్ కు ఎక్కువగా అనువుగా ఉంటున్నాయి.
అవుట్ ఫీల్డ్: మైదానం మొత్తం పొడిగా ఉంటుంది. బంతి పడిన వెంటనే జారిపోతుంది. దీనితో బ్యాట్ కు బాల్ తగిలిన వెంటనే ఫోర్ వెళ్తుంది.
బౌండరీ లైన్ తగ్గడం: ఇది వరకు సిక్స్ కొట్టాలి అంటే కనీసం 120 మీటర్లు కొట్టాల్సిన పరిస్థితి. కాని ఇప్పుడు మాత్రం 80 మీటర్లకే సిక్స్ వెళ్తుంది.
బ్యాట్: పాత తరం బ్యాట్ లకి కేవలం మధ్యలో మాత్రమే మందంగా ఉండటం జరిగేది. కాని ప్రస్తుతం వాడే బ్యాట్ లు తేలికగా ఉండటమే కాకుండా బ్యాట్ మొత్తం మందంగా ఉంటున్నాయి. బ్యాట్ కు ఎక్కడ తగిలినా బౌండరీ దాటుతుంది.
టి 20 ప్రభావం: టి20 ప్రభావం వన్డే క్రికెట్ మీద బాగా పడింది. పరుగులు వేగంగా చేయడం అలవాటు అయిపోయి భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు ఆటగాళ్ళు.
Also Read:సినిమాల్లోకి రాక ముందు మన టాప్ హీరోయిన్స్ పేర్లు ఏమిటో తెలుసా ?