హిందూ వివాహ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్దతులు ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని పాటించలేదు అంటే మాత్రం కీడు జరిగే అవకాశం ఉంది అనే భయం ఎక్కువగా ఉంటుంది. పురాతన కాలం నుంచి నేటి వరకు కూడా ఇదే కొనసాగుతుంది. అలాంటిదే ఒకటి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వధూవరులను విడిగా/కలవనీయకుండా ఉంచడం అనేది.
Also Read:మెజార్టీ లేని అభ్యర్థికి ఇంత సీన్ అవసరమా?
ఆషాఢ మాసంలో తొలకరి జల్లులుతో వర్షా కాలం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి రెండు నెలల పాటు రైతులకు అత్యంత ముఖ్యమైన సమయం. కాబట్టి మగవాళ్ళ పనులకు ఆటంకం లేకుండా కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా విడివిడిగా ఉంచుతారు అని కొందరు చెప్తారు. కాని దాని వెనుక బలమైన కారణం మరొకటి ఉంది. ఆషాఢ మాసంలో తొలి గర్భం ఏర్పడితే అది తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం అనే భావన ఉంటుంది.
తొలి కాన్పు తొమ్మిది మాసాల తర్వాత అంటే వైశాఖ జ్యేష్ఠ మాసముల మధ్య అంటే మే నెల వేసవి కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ సమయంలో ఆ వడగాల్పులు వేడి, ఆ తర్వాత వెంటనే వచ్చే వర్షాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. మొదటి కాన్పు తల్లికి మరింత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే జేష్ట మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు అవుతాయి.
ఆషాడమాసం గ్యాప్ ఇస్తే వయసులో ఉన్న జంటకు శ్రావణమాసం లో పూజల రూపంలో ఉపవాసం ఉంటే ఆ తర్వాత ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది అనే నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించి కొత్తగా పెళ్ళైన దంపతులను మొదటి ఆషాడం విడివిడిగా దూరంగా ఉంచుతారు. అయితే ఈ రోజుల్లో ఆషాడం రాక ముందే భార్యా భర్తలు ఇద్దరూ వేరు కాపురం పెడుతున్నారు. పిల్లల విషయంలో తల్లి తండ్రులతో సంబంధం లేకుండా ఎవరి ప్లానింగ్ వారు చేసుకుంటున్నారు.
Also Read:రేపు స్పీకర్ ఎన్నిక… ఇక మిగిలింది విశ్వాస పరీక్షే…!