మన దేశంలో మతానికి ఒక సాంప్రదాయం కులానికో ఆచారం ఉంటాయి. వీటి విషయంలో మనం చాలా ఆసక్తికరంగా కూడా ఉంటూ ఉంటాం. అవి పాటించలేదు అంటే మాత్రం పెద్ద నష్టం జరుగుతుంది అనే భయం మనలో ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది. కీలక విషయాలలో ఎవరు ఎన్ని చెప్పినా ఆచారం ప్రకారమే వెళ్తూ ఉంటాం. ఇక వివాహ సాంప్రదాయం విషయంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. నిశ్చితార్ధం తర్వాత పసుపు కొట్టిన తర్వాతనే పెళ్లి పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది.
అదే సమయంలో వడియాలు కూడా పట్టాల్సి ఉంటుంది. అయిదుగురు ముత్తైదువులు కలిసి పసుపుకొట్టాలి. అదే విధంగా పసుపు కొట్టిన తర్వాత నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి. నాన్ వెజ్ ఇంట్లో వండకూడదు పెళ్లి అయినా 16 రోజుల వరకు. ఆ తర్వాత గ్రాండ్ గా నాన్ వెజ్ తో భోజనం పెడతారు. ఇక ఆషాడ మాసం విషయానికి వస్తే… ఆషాడ మాసంలో భార్యా భర్తలు ఇద్దరినీ దూరంగా ఉంచుతారు. అసలు దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
ఆరోజుల్లో ఆషాఢంలో గర్భధారణ జరిగితే మండువేసవిలో ప్రసవం వస్తుంది కనక, నవజాతశిశువుకు కష్టమని ఒక భావన ఉండేది గతంలో. అందుకే ఆ నెల రోజులు దూరంగా ఉంచుతారు. అయితే అత్తగారి ముఖం అల్లుడు చూడకూడదు అని, అలాగే అమ్మాయి కూడా వాళ్ళ అత్తగారి ముఖం చూడకూడదు అని, ఇద్దరూ ఒకే గుమ్మంలో నడవకూడదు అని ఒక సాంప్రదాయం ఉంది. అయితే ఇప్పుడు 16 రోజుల పండుగ అయిన తర్వాత ఆషాడ మాసంలో దూరంగా ఉండాలని భయపడి భార్యా భర్తలు ఇద్దరూ వేరు కాపురం పెట్టేస్తున్నారు.
Advertisements
Also Read:
ఆకలి కంట్రోల్ చేసుకోవాలంటే ఏం తింటే బెటర్…?
గుండెపోటు మహిళలకు ఎందుకు తక్కువగా వస్తుంది…?