ఒక సినిమా షూట్ చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. అగ్ర హీరో సినిమా ప్రకటన వచ్చిన తర్వాత విడుదల వరకు దాదాపుగా రెండు నుంచి అయిదేళ్ళు కూడా పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు చేస్తున్న సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అదే జాబితాలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఇదిలా ఉంటే గతంలో ఎందుకు సినిమాలు స్పీడ్ గా అయ్యేవి ఇప్పుడు ఎందుకు స్లో అవుతున్నాయో చూద్దాం.
Also Read:బై బై కేసీఆర్.. నెక్ట్స్ ఎవరు..?
ఇప్పుడు ఏదైనా మంచి సీన్ షూట్ చేయాలి అంటే pre-cg, cgi అలాగే ఫైనల్ టచ్ అని చెప్పి వారం నుంచి పది రోజులు చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగి సినిమా తీయడం ఈజీగానే ఉన్నా ఆ టెక్నాలజీ ని కావాల్సినట్టు వాడటానికి రోజులు పడుతుంది. అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని వంటి హీరోలు ఏడాదికి 10 సినిమాలకు పైగా చేసే వాళ్ళు. రెండు మూడు సినిమాల షూటింగ్ లో ఒకే రోజు పాల్గొనే వారు.
కాని మహేష్ బాబు గాని జూనియర్ ఎన్టీఆర్ గాని ఒక్కో సినిమాకు మధ్య నెలకు పైగా గ్యాప్ తీసుకునే పరిస్థితి ఉంది. సినిమాలకు భారీ సెట్ వేయడం, చిన్న సాంగ్ బిట్ కోసం విదేశాలు అనడం వంటివి చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడం, షూట్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉంది. ఒకప్పుడు ఒక స్టూడియోలో సినిమా మొదలుపెడితే వెంటనే అయిపోయేది. అక్కడే సినిమా మొత్తం చేసే వాళ్ళు. ఎప్పుడో గాని ఊటి, సిమ్లా వెళ్ళే వాళ్ళు.
ఇక సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దానికి చేసే ప్రమోషన్ పెద్ద సముద్రం లాంటిది. ప్రీ టీజర్, టీజర్, ఫస్ట్ లుక్, ప్రీ ట్రైలర్, ట్రైలర్, ప్రి రిలీజ్, ఆడియో రిలీజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. వీటికి ప్లాన్ చేయడానికి రెండు నెలలు ఈజీగా పడుతుంది. అదే సమయంలో ఒక సినిమా చేసే వారు.
Advertisements
Also Read:క్రికెట్ లో అసలు ఎవరికి తెలియని రూల్ ఏంటో తెలుసా…?