కుందేలు” చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. వాటి సంతాన ఉత్పత్తి ఎక్కువే కావడంతో వ్యాపారం చేసే వాళ్ళు కూడా వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాటి చేష్టలు కాస్త ముద్దుగా ఉంటాయి. కుందేలు ముఖంతో పాటుగా అవి నడవడం, తినడం అన్నీ ముద్దుగానే ఉంటాయి. అయితే కుందేలు చెవులు ఎందుకు పెద్దగా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:అండమాన్ లోనే ఎందుకిలా?
కుందేలు చెవులు సాదారణంగా రెండు కారణాలతో పెద్దగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీవ పరిణామ క్రమంలో భాగంగా అవి మరింత పెద్దగా మారాయి. మొదటిది, వాటి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానినకి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటి కుందేలు చెవులు, రేడియేటర్ మాదిరిగా ఉపయోగపడతాయి. వాతావరణం లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, చెవులలో ఉండే రక్తనాళాలలోనికి రక్తం సాదారణంగా ప్రవేశించే దాని కంటే ఎక్కువగా ప్రవేశించి చెవులను విచ్చుకునే విధంగా చేస్తాయి.
విశాలమైన వాటి చెవులలోని రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం, అక్కడ చల్లబడి ఆ తర్వాత తిరిగి శరీరంలోనికి వెళ్తుంది. ఆ విధంగా వాటి శరీరం చల్లబడుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవులలోని రక్తప్రవాహం తగ్గి, తిరిగి ముడుచుకుపోవడం మనం చూడవచ్చు. ఇక రెండో కారణం చూస్తే… రెండవది, శబ్దాన్ని బాగా వినడానికి మరియు ఎటువైపు నుండి వస్తుందో కచ్చితంగా అంచనా వేయడానికి.
సాధారణంగా ప్రతి జీవికి రెండేసి చెవులు ఉండడానికి కారణం, శబ్దం వస్తున్న దిశను అంచనా వేయడానికి ఆ చెవులు బాగా ఉపయోగపడతాయి. కుందేలు శబ్దాలను వేగంగా అంచనా వేసి ప్రమాదాల నుంచి రక్షించుకుంటాయి అనే పేరు ఉంది. మనిషి వినలేని అధిక పౌనపుణ్యంగల శబ్ధాలను కూడా కుందేళ్ళకు వినే శక్తి ఉంటుంది. కుందేలు తన చెవులను రెండింటిని రెండు వేరు వేరు దిశలకు 270 డిగ్రీల కోణంలో తిప్పుతూ ఉంటాయి. అవి చాలా జంతువులకు ఆహారం కాబట్టి ఆ చెవులే వాటికి రక్షణ.