ఆర్మీ వాహనాల విషయంలో మనకు తెలియని ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటిదే ఆర్మీ వాహనాల నెంబర్… సాధారణంగా మన దేశంలో అన్ని మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ లను ఆయా రాష్ట్రాల రవాణా సంస్థ (ఆర్.టి.వో) ద్వారా ఇస్తారు. ఇవన్నీ రోడ్డు రవాణా-రహదారి మంత్రాంగ శాఖ పరిధిలో ఉంటాయి. ఆర్మీ వాహనాలు మాత్రం రక్షా మంత్రాంగ శాఖ పరిధిలో నమోదు చేస్తారు.
Also Read:ఎసిడిటి తగ్గాలంటే ఏం చెయ్యాలి…? భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగాకూడదా…?
ఆర్మీ నంబర్ ప్లేట్లు సాధారణంగా ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఇస్తారు. ఆర్మీ నెంబర్ ప్లేట్ లో ఉండే.. బాణం గుర్తు – దీనిని బ్రాడ్ ఏరో అని పిలుస్తారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తిని, ప్రత్యేకించి డిఫెన్స్ వనరులు, ఆస్తులను సూచించడానికి అప్పట్లో ఉపయోగించింది. స్వాతంత్ర్యం తర్వాత ఇదే పద్ధతిని మన దేశంలో కొనసాగిస్తున్నారు. నంబర్ ప్లేట్ తలక్రిందులుగా మారినప్పుడు సంఖ్యను తప్పుగా చదవకుండా ఉండేందుకు ఈ బాణం గుర్తు వాడతారు.
బాణం గుర్తు కేవలం ఆర్మీ వాహనాలకు మాత్రమే కాకుండా రక్షణ మంత్రిత్వ శాఖలో ఉండే కాగితం, కుర్చీ, టేబుల్ మొదలైన అన్ని ఆస్తులకు కూడా వాడతారు. మొదటి రెండు అంకెలు మిలిటరీ వాళ్ళు సదరు వాహనాన్ని కొన్న ఏడాదిని సూచిస్తాయి. ఆ తర్వాత అక్షరం వాహనం క్లాస్ ను చూపిస్తుంది. యుద్ధాలకు వాడే టాంకర్లు తరహా వాటికి ‘A’ వాడతారు. బైకులు, కార్లు లాంటివి లైట్ వెహికల్స్ ను ‘B’ తో సూచిస్తారు. ఇలా వివిధ తరగతులకి వేరు వేరు కోడ్ లు ఇస్తారు. తర్వాత ఆరు అంకెల సీరియల్ నెంబర్ ఉంటుంది. వాహనాల నిర్వహణ కోసం గుర్తుగా ఆఖరు అక్షరం ఉపయోగపడుతుంది.
Also Read:శవాల మీద పేలాలు ఏరుకుంటుంది టీఆర్ ఎస్ వాళ్లే..