ప్రపంచ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా జట్టు బలమైనది. గ్రేమ్ స్మిత్, కల్లిస్, డీవిలియర్స్, ఆమ్లా, స్టెయిన్, ఎన్తిని, మోరిస్ వంటి ఎందరో దిగ్గజాలు ఆ జట్టుని అత్యంత బలమైన జట్టుగా నిలబెట్టారు. అయితే అద్రుష్టం కలిసి రాక ఆ జట్టు ఇప్పటి వరకు ప్రపంచ కప్ గెలవలేదు. టెస్ట్ టీం గా నెంబర్ 1 స్థానంలో కొనసాగినా ఐసిసి ట్రోఫీని మాత్రం ఆ జట్టు కెప్టెన్ లు ముద్దాడలేదు. అది సరే గాని ఆఫ్రికా దేశం అయినా సరే ఆ జట్టులో తెల్ల ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు.
Also Read:ఆ అలవాట్ల కోసం ఎయిర్‌పోర్టుకు మకాం మార్చాడు..!
అసలు దానికి కారణం ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. సౌత్ ఆఫ్రికా కి స్వాతంత్ర్యం వచ్చింది 1994 లో. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మేజర్ స్పోర్ట్స్ లో తెల్లవాళ్లే ఆ దేశాన్ని రెప్రెసెంట్ చేస్తూ ఉండే వాళ్ళు. నెల్సన్ మండేలా ఆ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం అన్ని జాతుల వాళ్ళను కలుపుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా టాలెంట్ ఆధారంగా స్పోర్ట్స్ లో ప్రోత్సహించారు.
తెల్ల వాళ్లకు ఎక్కువగా సౌకర్యాలు ఉండేవి అప్పట్లో. వాళ్ళ పిల్లలు క్రికెట్, రగ్బీ లాంటి ప్రధాన క్రీడల్లో ఎక్కువగా రాణించారు. ఇక మరో కారణం చూస్తే… ఆ దేశంలో నల్ల జాతి వారు ఫుట్ బాల్ ను ప్రాణంగా చూస్తారు. నల్ల వాళ్ళ పిల్లలకు క్రికెట్ కంటే కూడా అదే కీలకంగా ఉండేది. ఆ దేశ ఫుట్ బాల్ టీంలు చూస్తే నల్ల వాళ్ళే ఉంటారు. ఇప్పుడే కాస్త నల్ల వాళ్ళు క్రికెట్ వైపు చూస్తున్నారు.
Also Read:స్విమ్ సూట్ లో మత్తెక్కిస్తున్న లిసా… పిక్స్ వైరల్