అమెరికాకు సంబంధించిన వీడియో లు మనం చూసినప్పుడు చాలా వరకు చెక్క ఇల్లే కనపడుతూ ఉంటుంది. అక్కడ ఎందుకు ఆ విధంగా నిర్మిస్తారు అనే అవగాహన చాలా మందికి లేదు. దాని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం… అక్కడ క్వాలిటీ కలప విరివిగా దొరుకుతుంది. మనకు మాదిరి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చెక్కతో ఇల్లు కట్టుకోవడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.
Also Read:అబ్బాయిలు ట్రైన్ దగ్గర డోర్ ఎందుకు కూర్చోవడానికి ఇష్టపడతారు…?
వాళ్ళు ఇళ్ళు పెద్దవిగా విశాలంగా కట్టుకుంటూ ఉంటారు. ఇక వాటిని మెయింటెన్ చెయ్యడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరమ్మత్తులు చేయడం కూడా పెద్ద కష్టం కాదు. అదే విధంగా ఒకసారి కట్టిన తర్వాత అవి నచ్చలేదు అంటే కొద్ది కొద్ది మార్పులతో వెంటనే డిజైన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. చెక్కను సులభంగా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఇక మరో ప్రధాన కారణం ఏంటీ అంటే…
అక్కడ చలి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెక్కతో కట్టిన ఇళ్ళు వెచ్చగా ఉంటాయి. చెక్క ఇళ్ళలో శబ్దాలు కూడా పెద్దగా వినపడవు. ఇక అక్కడ భూకంపాలు కూడా ఎక్కువగా వస్తు ఉంటాయి. అప్పుడు చెక్కతో చేసిన ఇళ్ళతో ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. అలాగే చెక్కతో కట్టిన ఇళ్ళకు పన్నులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే అవి సిమెంట్ ఇటుకలతో కట్టిన దృఢంగా ఉండవు. చెమ్మకు తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అగ్ని ప్రమాదం అయితే జరిగే నష్టం ఎక్కువ. అక్కడ దాన్ని బీమాతో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Also Read:డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మంచిదా సింగిల్ డోర్ మంచిదా…?