ఈ రోజుల్లో మనం కొనుగోలు చేసినా సరే దానికి స్టార్ రేటింగ్ చూడకుండా కొనడం లేదు. ఆన్లైన్ అయినా ఆఫ్ లైన్ అయినా సరే స్టార్ రేటింగ్ అనేది చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులను అంటే ఫ్రిడ్జ్, ఏసీ వంటివి కొంటే వాటి మీద స్టార్ గుర్తులు ఉంటాయి. అసలు ఆ స్టార్ గుర్తులు ఏ సూచిస్తాయో ఒక్కసారి చూద్దామా…? సాంకేతిక గురించి అవగాహన లేని వారికి కూడా ఈ స్టార్ రేటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ స్టార్స్ ఏంటో చూద్దాం.
Also Read:పునీత్ సమాధిని సందర్శించిన అల్లుఅర్జున్
1. ఎక్కువ స్టార్స్- ఎక్కువ ఆదా
ఏదైనా ఒక వస్తువు అదే ఫీచర్స్ తో దాదాపుగా అన్ని బ్రాండ్స్ లో దొరికినప్పుడు… ఆ వస్తువు సమర్ధతను అంచనా వేయడానికి, ఎక్కువ ఆదా చేయడానికి ఎక్కువ స్టార్స్ ఉన్నవి కొనాల్సి ఉంటుంది. వస్తువు క్వాలిటీ మాత్రమే కాదు దాని లైఫ్ టైం పై కూడా ఒక వగాహన వస్తుంది.
2. విద్యుచ్ఛక్తి వినియోగం
స్టార్స్ కింద సూచించిన సంఖ్య ఆ పరికరం సంవత్సరానికి ఎన్ని యూనిట్లు విద్యుత్ ని వాడుకుంటుందో మనకు వివరిస్తుంది. ఎంత తక్కువ వాడుకుంటే అంత ఎక్కువ కరెంట్ ఆదా అయినట్టు అన్నట్టు.
3. లేబిల్ కాలపరిమితి
ప్రతి లేబిల్ కు కూడా కొంత కాలమే వ్యవధి ఉంటుంది. కాలం మారే కొద్దీ కొత్త కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి… అంతకుముందు కంటే కన్నా మెరుగైన సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దానికి 5 స్టార్స్ కేటాయించి, అప్పటి వరకు 1 స్టార్ ఉన్న పరికారాలకి స్టార్ రేటింగ్ రద్దు చేస్తూ ఉంటారు.
4. సాంకేతిక వివరాలు
ఆ ఉపకరణం పేరు అలాగే బ్రాండ్ పేరు మరియూ వివిధ సాంకేతిక పరిమాణాలు ఇక్కడ చెప్తారు.
5. వర్తించే నియమాలు
లేబిల్ చివరలో ఏ ప్రమాణాల ప్రకారం ఆ ఉపకరణాన్ని పరిక్షించారో ఉంటుంది. ఏ పరిక్షా నియమాలు వాడారో వివరిస్తారు. వివిధ ఉపకరణాల రేటింగ్స్ ని మీరు BEE యాప్ లో కూడా చూసే అవకాశం ఉంటుంది.
Also Read:అన్ ప్రొషెషనల్ హీరోయిన్ నా… మూడేళ్ళ తరువాత సాయి పల్లవి రియాక్షన్