బండి ఎక్కాం, స్టార్ట్ చేసాం, వెళ్లాం, వచ్చాం… ఇవేగాని ఎప్పుడైనా కొన్ని విషయాలు ఆలోచించారా చెప్పండి… టైర్ లు నల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా అసలు మీకు. తెలీదు కాబట్టే తెలుసుకుందాం ఒకసారి.
కారు టైర్ల తయారీలో వాడే రబ్బరు కార్బన్ బ్లాక్. దాని సహజ రంగు నలుపు. దాన్ని మనం కార్బన్ బ్లాకు అని పిలుస్తాం. వాస్తవానికి కార్బన్ బ్లాక్ ను వాడితే టైర్లు రాపిడిని తట్టుకుని మన్నికగా ఉంటాయి. టైర్ ధృడంగా ఉండటమే కాకుండా రోడ్డుపై నుంచి వచ్చే వేడిని తట్టుకుని నిలబడుతుంది. టైర్లు ముందు కొంత వరకి తెలుపు రంగులో ఉత్పత్తి చేస్తూ ఉండే వాళ్ళు.
ఆ టైం లో జింక్ ఆక్సైడ్ ని రబ్బరు లో కలపడంతో… వాస్తవానికి జింక్ ఆక్సైడ్ సహజ రంగు తెలుపు. దీనితో టైర్లు ఆ రంగులో ఉండేవి. అయితే అవి ఎక్కువగా రాపిడి తట్టుకోలేక ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాత ఆలోచన మార్చేసి జింక్ ఆక్సైడ్ స్థానం లో కార్బన్ బ్లాకు వాడటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి టైర్ల మన్నిక పెరుగుతూ వచ్చింది.