మనం హచ్ అని తుమ్మినప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ గాని నానమ్మ గాని దీర్ఘాయుష్షు అని దీవిస్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు దీవిస్తారు అనేది చాలా మందికి తెలియదు. అయితే అలా దీవించడం వెనుక మాత్రం చాలా మందికి తెలియని ఒక శాస్త్రీయ కారణం ఉంది. తుమ్మినప్పుడు అత్యంత కొద్ది సమయం పాటు అంటే క్షణంలో అరవయ్యవ వంతు సమయం గుండె ఆగి మళ్ళీ తిరిగి కొట్టుకుంటుంది.
తుమ్మినప్పుడు గుండెకు రక్త ప్రసారం తగ్గిపోవడంతోనే అలా జరుగుతుంది. అప్పుడు గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. కాని గుండెలోని ఎలక్ట్రికల్ కార్యకలాపాలు సాగుతూ ఉండటంతో మళ్లీ, తుమ్ము అయిపోయిన వెంటనే సామాన్యంగా గుండె కొట్టుకుంటుంది. అలా చూస్తే మనిషి ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్టే కదా…? ఆ విధంగానే రాత్రి వేళ అయితే మనం దీవించడానికి సరిపోము కాబట్టి… “కృష్ణా! రేపటి దీవెన” అని అంటూ ఉంటారు.
ఇతర దేశాలో కూడా తుమ్మినప్పుడు దీవిస్తూ ఉంటారు. ఇక తుమ్ము వచ్చినప్పుడు ఆపదమం ఎంత మాత్రం మంచిది కాదు. తుమ్ము వంద మైళ్ళ వేగంతో వస్తుంది. అంత వేగంతో వచ్చే తుమ్ముని గనుక మనం ఆపితే మాత్రం కచ్చితంగా లోపలి నరాలు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా వస్తే అలా తుమ్మడమే మంచిది. కొందరు సిగ్గుతో తుమ్ము ఆపుకుంటారు. కొన్ని సందర్భాల్లో లోపలి నరాలు పగిలిపోయి ప్రానంతక స్థితి కూడా రావొచ్చు.