ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున తేనెటీగలను అధికారులు చంపివేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 మిలియన్లకు పైగా తేనెటీగలను అధికారులు చంపివేశారు. అయితే తేనె పరిశ్రమను రక్షించేందుకే తాము ఈ చర్యను తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
పలు దేశాల్లో ఇటీవల వర్రోవా మైట్ ప్లేగ్ విజృంభిస్తోంది. ప్రపంచంలో తేనే ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు గాను పెద్ద ఎత్తున తేనె తెట్టెలను అధికారులు ధ్వంసం చేస్తున్నారు.
వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఆరు మైళ్ల దూరం వరకు నిర్మూలన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధి వ్యాప్తి చెంద కుండా ఉండేందుకు వీలైనంత వరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలో తేనే ఉత్పత్తి చేసే పలు దేశాల్లో ఈ వరోరా మైట్ ప్లేగ్ విజృంభిస్తోందని న్యూ సౌత్ వేల్స్ ప్లాంట్ ప్రొటెక్షన్ చీఫ్ సతేంద్ర కుమార్ అన్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు ఈ వ్యాధి కనిపించలేదన్నారు.