క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఆట. అంతే కాదు ఐపీఎల్ పుణ్యమా అని ఆయా దేశాల ఆటగాళ్ళకు సైతం దేశంగానీ దేశాల్లో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత మంది ప్రేమించే క్రికెట్ ఆటలో కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు పిచ్ ని బ్యాట్ పెట్టి పరిశీలిస్తూ ఉంటారు.
ఇలా ఎందుకు పిచ్ ని బ్యాట్ తో పరిశీలిస్తారు..? దీని వెనుక కారణాలు చాలా మందికి తెలియదు. మ్యాచ్ ఆడేటప్పుడు పిచ్ మారుతూ ఉంటుంది.ఈ విషయం గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు పిచ్ ని బ్యాట్ పెట్టి చెక్ చేస్తే వాళ్లకి పక్కాగా అది ఉపయోగ పడుతుంది.
ఇలా చెక్ చేయడాన్ని గార్డెనింగ్ అని అంటారు. ఉబ్బెత్తుగా పిచ్ మీద ఉంటే బ్యాట్ తో వాటిని సెట్ చేసేయచ్చు. రఫ్ ప్యాచ్ లు వంటివి ఉన్నా కూడా సెట్ చేస్తూ వుంటారు. అలానే క్రికెట్ ఆడే సమయం లో ఆటగాళ్ల పైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ని దూరం చేసుకోవడానికి కొందరు పిచ్ ని బ్యాట్ తో కొడుతూ వుంటారు.
అంతే కాక బ్యాట్ తో ఇలా కొట్టడం వలన బౌలర్ రిథమ్ దెబ్బ తింటుందని…వాళ్ళ రిథమ్‌ను దెబ్బ తీసేందుకే కొందరు ఇలా చేస్తూ ఉంటారట. గార్డెనింగ్ చేయడం వలన పిచ్ కండిషన్ కూడా తెలుస్తుంది. ఈ కారణాల వల్లనే ఆటగాళ్లు బ్యాట్ తో పిచ్ ని కొడుతూ వుంటారు.