తెలంగాణలో బీజేపీ నాయకులెవరయినా సరే… ఇప్పడు ఉద్యోగ సంఘాల నేతలను, సంఘాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని, సంఘాల నేతలెకు- ఉద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని గట్టిగా ఆరోపిస్తున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్ సహా కీలక నేతలంతా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కానీ… సడన్ గా బీజేపీ వ్యూహాం ఎందుకు మార్చినట్లు అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే, బీజేపీ వేసిన ఈ వ్యూహాం వెనుక పెద్ద ఎత్తుగడే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం చేసే పని ఏదైనా ఉద్యోగుల ద్వారానే ప్రజలకు చేరాలి. ప్రభుత్వాధినేతలకు, ప్రజలకు ఉద్యోగులే వారధులు. ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, చివరి వరకు నిలబడిన ఉద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంలో సంతృప్తిగా లేరు. ఒక్కరు చేసే పని నలుగురు చేయాల్సి వస్తుంది. గతంలో పెంచిన కొంతైనా టైంకి పెంచేవారు. అన్ని సమయానికి జరిగేవి. కానీ కేసీఆర్ పాలనలో అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టిగా తయారుకాగా, ఎన్నికలప్పుడే కేసీఆర్ కు గుర్తొస్తాం అన్న అభిప్రాయం బలంగా నాటుకపోయింది. పైగా ఉద్యోగ సంఘాల నేతలను నయానో బయానో సంతృప్తిపర్చుతున్నారే కానీ సగటు ఉద్యోగికి ఉన్న కష్టాలు అనేకం.
దీంతో సహాజంగానే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ఉపాధ్యాయుల్లో అయితే ఇంకాస్త అధికం. ఇటు కేసీఆర్ కు కూడా ఉపాధ్యాయుల పట్ల ముందునుండి నెగెటివ్ దృష్టితోనే ఉన్నారన్న అభిప్రాయం ఉంది. దీంతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరిగిందని… ఇప్పుడు ఆ గ్యాప్ ను బీజేపీ వాడుకోవాలనుకుంటుందని అంచనా వేస్తున్నారు. పైగా ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి ఓటర్లలో ప్రతిబింబిస్తుంది. అందుకే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓటమి వెనుక ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారని టీఆర్ఎస్ అంతర్గతంగా విశ్లేషించుకుంది. వారికి గ్రేటర్ లో డ్యూటీలు కూడా వేయించలేదు. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఉద్యోగులందరిలోనూ అసంతృప్తి గట్టిగానే ఉందని అర్థం అయ్యింది. ఇప్పుడు వీరి కోసమే బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. ఒక్కో ఉద్యోగి ఎంతో మందిని చైతన్యం చేయగలడు. మౌత్ పబ్లిసిటీలో వీరే కీలకం. అందుకే బీజేపీ సగటు ఉద్యోగిని తనవైపుకు తిప్పుకునే ప్లాన్ చేస్తుండగా… ఐఆర్ ఇచ్చేస్తున్నా, జనవరి మూడో వారంలో పీఆర్సీ ఇచ్చేస్తున్నాం అంటూ కేసీఆర్, టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నాయి.