క్రికెట్ మ్యాచుల్లో సహజంగానే బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌లోనూ, బౌలర్లు బౌలింగ్ చేయడంలోనూ నిష్ణాతులు అయి ఉంటారు. ఈ క్రమంలోనే వారు తమకు ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఆ రెండింటిలో రాణిస్తుంటారు. ఇక ఆల్ రౌండర్ల విషయానికి వస్తే వారు అటు బ్యాట్స్‌మెన్లుగా, ఇటు బౌలర్లుగా.. రెండు విధాలుగా ఆడగలరు. అయితే బౌలర్లు మాత్రం మ్యాచ్‌లలో అసలు బ్యాటింగ్ చేయలేకపోతుంటారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఏమాత్రం ఎదుర్కొనలేకపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది ? బౌలర్లు ఎందుకు సరిగ్గా బ్యాటింగ్ చేయలేరు ? అంటే…
సాధారణంగా ఏ టీమ్‌కు అయినా సరే బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ ఉంటారు. అయితే బ్యాట్స్‌మెన్లు కేవలం బ్యాటింగ్‌నే ప్రాక్టీస్ చేస్తారు. బౌలర్లు కేవలం బౌలింగ్‌నే ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ సెషన్లలోనూ వారు వాటినే ప్రాక్టీస్ చేస్తారు. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా చెబితే తప్ప వారు భిన్న అంశంలో ప్రాక్టీస్ చేయరు. అందువల్ల వారికి రాను రాను కేవలం ఒకే స్కిల్ మాత్రమే అలవడుతుంది. దీంతో బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. బౌలర్లు అయితే బౌలింగ్ మాత్రమే చేయగలరు. బ్యాటింగ్ చేయడం వారికి కష్టమవుతుంది.
కానీ కొందరు బౌలర్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకున్నా సరే కొన్ని సార్లు మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తారు. ఉదాహరణకు భారత మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లె వంటి వారు మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్లుగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అశ్విన్, బుమ్రా వంటి వారు మ్యాచ్‌లలో అప్పుడప్పుడు బ్యాటింగ్‌లోనూ విజృంభిస్తున్నారు. అందువల్ల బౌలర్లు బ్యాటింగ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతారని అనలేం. అలా అని చెప్పి వారు అసలు బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యామ్నాయం కాదు. మ్యాచ్‌లలో అవసరం ఉన్నప్పుడు టీం మేనేజ్‌మెంట్ బౌలర్లను బ్యాట్స్‌మెన్లుగా వాడుకుంటుంది. అంతే.. అందుకనే బౌలర్లు కేవలం కొన్ని సందర్భాల్లోనే బ్యాట్స్‌మెన్లుగా రాణిస్తుంటారు. మిగిలిన సమయాల్లో బ్యాటింగ్ చేయడంలో విఫలం అవుతుంటారు.