హిందూ వివాహ సాంప్రదాయంలో ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పెళ్లి పనులను పసుపు కొట్టి మొదలు పెట్టిన దగ్గరి నుంచి కూడా ప్రతీ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అది సరే గాని పెళ్ళి తంతులో ఒక ఆసక్తికర ఘట్టం ఉంటుంది.
Also Read:40 కోట్లను 4వేల కోట్లు చేశాను….!
అదే వరుడి కాళ్ళు కడగడం… పెళ్లి కొడుకుని విష్ణు మూర్తిగా భావించి కాళ్ళు కడుగుతారు. కాని లక్ష్మీ దేవిగా భావించే పెళ్లి కూతురి కాళ్ళు మాత్రం కడగరు. దాని వెనుక కారణం ఏంటో చూద్దాం. వివాహ వేదిక వరకు వరుడు నడుచుకుంటూ వస్తాడు. అదే వధువు అయితే లక్ష్మీ దేవి కాబట్టి కాలు కింద పెట్టకుండా తీసుకొస్తారు. ముహూర్తం అయ్యే వరకు ఆమె కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు.
తమ ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కాలు కందకుండా చూడాలి అనే భావనతో. ఆమెను తమ మేనమామ వరుస అయ్యే వాళ్ళు పెద్ద గంపలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఆ గంపను కమలంలా భావిస్తారు. ఇక పుట్టింటి తరుపు వాళ్ళు ఎందుకు తీసుకోస్తారంటే… మా అమ్మాయిని కాలు క్రింద పెట్టకుండా పెంచాము కాబట్టి… మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం కోసం అలా చేస్తారు. అలా తీసుకొచ్చిన మేనమామలకు బట్టలు కూడా వరుడి తల్లి తండ్రులు కృతజ్ఞతగా పెట్టాలి. అందుకే వధువు కాళ్ళు కడగరు. ఇక దానం తీసుకునే వాడు వరుడు కాబట్టి… దానం ఇచ్చే పిల్ల తల్లి తండ్రులు కన్యాదానానికి ముందు కాళ్ళు కడిగి ఇవ్వాల్సి ఉంటుంది.