ఈ రోజుల్లో కారుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొందరు మాట వినకపోవడంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే… మరికొన్ని చిన్న చిన్న తప్పులతో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Also Read:నగరంలో భారీ వర్షం… రంగంలోకి జీహెచ్ ఎంసీ..!
కారుల్లో బాడీ స్ప్రే లతో పాటుగా శానిటైజర్ వంటి వాటితో కూడా ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. ఇక కారుల్లో కొందరు డియోడ్రెంట్లు క్యారీ చేస్తూ ఉంటారు. అసలు అవి ప్రమాదం అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. స్ప్రే చేసుకునే కార్లలో ఉంచటం అత్యంత ప్రమాదకరంగా నిపుణులు చెప్తున్నారు. కారును ఎక్కువగా ఎండలో పార్క్ చెయ్యాల్సిన అవసరం ఉంటే మాత్రం అస్సలు అవి కారులో ఉండటం కరెక్ట్ కాదు.
ఈ తరహా స్ప్రేలను ఏరోసోల్స్ అని పిలుస్తారు. వాటిలోని డియోడ్రెంటు బయటకు తుంపరలా రావటానికి ప్రొపెల్లంట్లను తయారీదారులు కలుపుతారు. ప్రొపెల్లంట్లు తేలికగా మండే స్వభావంతో ఉంటాయి. అందుకే డియోడ్రంటుపై హెచ్చరిక కూడా ఇస్తారు. వేడెక్కే అవకాశం ఉన్న ప్రదేశాల్లో అలాంటి వాటిని ఉంచడం కరెక్ట్ కాదని చెప్తారు. ఇలాంటి వాటిని కారులో పెడితే… కారు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే అక్కడ కారు వేడెక్కి లోపల ఉష్ణం పెరిగి క్యానులోని ప్రొపెల్లంట్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
Also Read:కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి..