ఈ రోజుల్లో చెట్ల మీద ప్రజలకు అవగాహన వచ్చి వాటిని నరకడానికి ఎవరూ ఇష్టపడటం లేదనే చెప్పాలి. అయితే ఈ రోజుల్లో కూడా కొన్ని అతి విశ్వాసాలు, అనవసర విషయాలను దృష్టిలో పెట్టుకుని చెట్లను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. భారీ వృక్షాలను సైతం నరికే పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక పూర్వం చెప్పిన వాటిల్లో చింత చెట్టు, రావి చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అని చెప్పడంతో అవి పెరిగినా నరికేస్తూ ఉంటారు.
Also Read:17 ఏండ్లకే ఓటు హక్కు నమోదు… ఈసీ కీలక నిర్ణయం
అందులో ఎంత వరకు వాస్తవం ఉందో ఒకసారి చూద్దాం. ఇతర చెట్లతో పోలిస్తే చింత వేళ్ళు చాలా బాగా బలంగా ఉంటాయి. ఇంటికి చాలా దూరంగా లేకపోతే మాత్రం ఇంటి గోడలకు ప్రమాదం ఉంటుంది. అలాగే చింత చెట్టు గాలి బాగా వేడిగా ఉంటుంది. ఇక ఆకులు చిన్నగా ఉండటంతో దాని నుంచి వచ్చే నీడ పెద్దగా ఉండదు. ఇక ఆ కొమ్మలు ఎక్కువగా పెరగడంతో ఆకులు రాలి చిరాకుగా ఉంటాయి.
ఇక వేప చెట్టు కూడా ఇలాగే నరుకుతున్నారు. అయితే వేప వాకిట ఉంటే నీడ, చల్లటి గాలి వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. అయితే భారీ వృక్షాలుగా పెరిగేవి ఇంటి చుట్టూ ఉండటం మంచిది కాదు. కనీసం ఇంటికి 50 నుంచి 80 అడుగుల దూరంలో ఉండటమే మంచిది. గాలి దుమ్ములకు కొమ్మలు విరిగే అవకాశం ఉండటం, వాటి చెత్త ఎక్కువగా ఉండటం ఇవన్నీ ప్రధాన సమస్యలు. వేరు పెరిగితే కచ్చితంగా గోడ పగిలిపోతుంది.
Also Read:విక్రాంత్ రోణ మూవీ రివ్యూ