మెగాస్టార్ చిరంజీవి” ఈ పేరు వింటే అద్భుతమైన నటన, కళ్ళు చెదిరే డాన్స్, పాత్రకు తగ్గట్టు మారిపోయే బాడీ లాంగ్వేజ్ మన కళ్ళ ముందు కనపడతాయి. ఏ పాత్ర అయినా సరే చేయగల ప్రతిభ, ఎలాంటి డాన్స్ అయినా చేసే సామర్ధ్యం ఆయన సొంతం. ఇప్పటికీ టాలీవుడ్ లో చిరంజీవి డాన్స్ తో పోటీ పడే నటులు లేరు అనే మాట వాస్తవం. ఇక చిరంజీవి డాన్స్ ఎందుకు ప్రేక్షకులకు నచ్చుతుందో చూద్దాం.
Also Read:బ్రహ్మానందం కెరీర్ లో మరువలేని సినిమాలు…!
చిరంజీవి డాన్స్ అందంగా కనపడటానికి ప్రధాన కారణం ఆయన బాడీ. ఆయన మరీ ఎత్తు లేకపోవడం అలా అని మరీ పొట్టిగాను ఉండరు. ఆయన సినిమాల్లోకి రాక ముందు సాంప్రదాయ డాన్స్ జోలికి వెళ్ళలేదు. దీనితో డాన్స్ లో ఆయన శైలి అనేది ఉండదు. ఏ విధమైన డాన్స్ అయినా చేయగలరు. దానికి తోడు ఆయన మంచి నటుడు కావడం కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి.
కేవలం డాన్స్ అంటే ఎగరడం మాత్రమే కాకుండా హావభావాలు ప్రదర్శించడం అభిమానులకు బాగా నచ్చిన అంశం. ఇక ఆయన ఫిట్నెస్ కూడా బాగా కలిసి వచ్చింది. ఏ విధమైన స్టెప్ అయినా సరే సింగిల్ టేక్ లో చేయడం ఒకటి అయితే చేసినంత సేపు కూడా ఒక ఎనర్జీ ఉండేది. డాన్స్ లో ఎనలేని ఈజ్ కూడా ఉంటుంది. 30 ఏళ్ళ క్రితం చేసిన డాన్స్ ఇప్పుడు చూడబుద్ది అవుద్ది. ఈ తరం వాళ్ళు ఆ తరహాలో డాన్స్ చేయడం అనేది సాధ్యం కాదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ తరంలో మంచి డాన్సర్స్ అంటారు సినిమా పరిశీలకులు.
Also Read:ఆయుష్మాన్ భారత్.. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ స్కీం: మోడీ