సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి? అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం తెలంగాణలో నడుస్తున్న స్వార్థరాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కుట్రలు పన్నుతున్నాయని, కానీ కాంగ్రెస్ ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టేవారికి, పార్టీలకు యువత దూరంగా ఉండాలని మధుయాష్కి సూచించారు.