తన సొంత ప్రభుత్వంలో పనిచేస్తున్న శాఖలపై కేసీఆర్ కు నమ్మకం లేదా…? ప్రజలందరికీ మార్గదర్శిగా ఉంటూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాల్సిన సీఎం ప్రైవేటుకు ఎందుకు వెళ్లినట్లు…? ప‌్రభుత్వ వైద్యం పడకేసిందన్న ఆరోపణలను కేసీఆర్ అంగీకరించినట్లేనా…?
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పరిధిలోని ఆసుపత్రులు, పాఠశాలలు ఎలా ఏ శాఖలోనూ మంచి, చెడు ఏదీ జరిగినా కేసీఆర్ దే బాధ్యత. ప్రభుత్వం నడుపుతున్న కీలకమైన విద్య, వైద్యం వంటి వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించే బాధ్యత ఆయనదే. కానీ ముందు నుండి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం భిన్నంగా ఉంది.
గవర్నర్ గా నరసింహాన్ ఉన్న సమయంలో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసుకునే వారు. తన కంటి పరీక్షలతో పాటు వైద్యం కూడా అక్కడే చేయించుకునే వారు. ప్రభుత్వాధినేతలు కూడా ఇలాగే చేస్తుంటారు. కానీ కేసీఆర్ తీరు మాత్రం ఏమాత్రం మారటం లేదు. గతంలో కంటి పరీక్ష కోసం ఏకంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, ఇప్పుడు సిటి స్కానింగ్ కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఎంతో మంది పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ దవాఖానలున్నాయి. నిష్ణాతులైన డాక్టర్లున్నారు. కానీ వాటిని కాదని సీఎం ప్రైవేటుకు వెళ్లి జనానికి ఏం చెప్పదల్చుకున్నారు, మీ హాయంలో అందే వైద్యంపై మీకే నమ్మకం లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా వైద్యం పడకేసిందని… ఇలాంటి చర్యలతో సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని… తద్వారా ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు పెరిగిపోతాయని మండిపడుతున్నారు.