సిద్ధిపేట లేకపోతే నేను లేను… నేను లేకపోతే తెలంగాణ లేదంటూ సీఎం కేసీఆర్ ఇటీవల సిద్ధిపేట పర్యటనలో వ్యాఖ్యానించారు. అంతేకాదు సిద్ధిపేటకు ఎయిర్ పోర్టు వస్తుందంటూ ప్రకటించారు. అది సాధ్యమవుతుందా…? కాదా…? అన్న అంశాన్ని పక్కన పెడితే, ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రికి లేఖ ఇచ్చారు.
మా రాష్ట్రంలో కొత్తగా ఐదు ఎయిర్ పోర్టుల నిర్మాణం అవసరం ఉందని… వాటిని వెంటనే నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
కేసీఆర్ కోరిన కొత్త ఎయిర్ పోర్టులు ఎక్కడెక్కడ అంటే…
1. పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్
2. వరంగల్ అర్బన్ జిల్లాలోని మమ్నూర్
3. అదిలాబాద్
4.మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర
5. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి
6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంతవరకు బాగానే ఉన్నా… సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన సిద్ధిపేట ఎయిర్ పోర్టును అడగలేదని స్పష్టంగా కనపడుతుంది. దీంతో ఎయిర్ పోర్టు ముచ్చట పేరుకేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, ఇవి గతంలో ఉన్న ప్రపోజల్స్ అని… వీటికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ ఉందని సర్టిఫై చేశాయని అందుకే మరోసారి అడిగినట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.