రాజధాని నగరంలో… హైటెక్ వీధుల్లో మరో నిర్భయ కేసు ఇది. ఓ మహిళను మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేయటం, ప్రియాంక చనిపోయిందని తెలిసినా… పాశవికంగా ప్రవర్తించిన మృగాళ్లను చంపేయండి అంటూ నిందితుల తల్లితండ్రులే డిమాండ్ చేస్తున్న క్రూరమైన చర్యపై దేశం కన్నీరు పెడుతోంది. ప్రతి ఒక్కరు ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడుతూనే… నిందితులను ఉరితీయాలంటూ తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంక కేసు-పోలీసులపై చర్యలేవీ…?
ఇంత జరగుతున్న సీఎం కేసీఆర్ మాత్రం స్పందించ లేదు. ప్రియాంక ఇంటికి వెళ్లి పరామర్శ దేవుడెరుగు… కనీసం ఒక్క చిన్న ఖండన ప్రకటన కూడా చేయకపోవటం అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. రాష్ట్రానికి తండ్రిలాంటి స్థానంలో కూర్చోని… రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతున్నా, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసనలు తెలియజేస్తున్నా… కనీసం స్పందించకపోవటం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం తరుపున కొంతమంది మంత్రులు వెళ్లి వచ్చారు. అక్కడకు వెళ్లి వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని, సత్యవతి రాథోడ్‌లాంటి నేతలు కూడా చెల్లికి ఎందుకు కాల్ చేసింది… పోలీసులకు కాల్ చేయాల్సింది అంటూ మాట్లాడి జనం ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. కేటీఆర్ మాత్రం ట్విట్టర్ ద్వారా ప్రియాంక హత్యను ఖండించారు.
నా కొడుకును ఎలా చంపినా పర్లేదు: చెన్నకేశవులు తల్లి
కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రియాంక మృతిపై తమ నిరసనను, ఖండనను కూడా తెలియజేయలేదు. పరామర్శ సంగతే లేదు. దీంతో.. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం… ప్రియాంక తల్లితండ్రులే స్వయంగా పోలీసులు మమ్మల్ని అటూ ఇటూ తిప్పారు కానీ పట్టించుకోలేదంటూ చెప్పినా వారిపై కనీసం చర్యలు తీసుకోలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పోలీసులనే నమ్ముకున్నారని, కానీ అలాంటి పోలీసులు పట్టించుకోకపోతే చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు.