మా జిల్లా పై మీ పెత్తనం ఏంటి, మేము సీనియర్స్ ఏలా గెలవాలో మాకు తెలుసు, మేము అంతా ఒక్కటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మా జిల్లాలో ఎం పని అని బీరాలు పలికిన నల్గొండ సీనియర్స్ ఎక్కడ అని అడుగుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ఉప్పు నిప్పుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఒకే రాత్రికి ఆప్తమిత్రులుగా అయిపోయారు. హుజూర్ నగర్ ఎన్నికల విషయం లో రేవంత్ రెడ్డి కి నల్గొండ సీనియర్స్ కు మధ్య ఏర్పడ్డ వివాదం నల్గొండ సీనియర్స్ ఐక్యత కు దారి తీసింది. రేవంత్ రెడ్డిపై ఉన్న కోపంతో మేము అంత ఒక్కటే , హుజూర్ నగర్ గెలిచి చూపిస్తాం అని ప్రకటనలు చేశారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నల్గొండ సీనియర్స్ అంత తామే అన్నట్లు ప్రచారం చేశారు, మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ మాకు అడ్డులేదు, హుజూర్ నగర్ ఉత్తమ్ కంచుకోట… గెలుపు నల్లేరుపై నడకే… గెలిచి తమ సత్తా చూపిద్దాం అనుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నల్గొండ సీనియర్స్ కు టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి రెస్పాన్స్ రాకపోవడం, అధికార పార్టీ దూసుకపోతుండడంతో ఉత్తమ్ కు టెన్షన్ మొదలైంది. స్థానిక కార్యకర్తలు కూడా రోజురోజుకు చేజారిపోతుండడంతో ఓటమి తప్పదని భావించి, ఇక సీనియారిటీ ని పక్కన పెట్టి రేవంత్ తో ప్రచారం చేయించాలి అని ఢిల్లి పెద్దలను కొరినట్లుగా సమాచారం.
భారీ ఓటమి తప్పదు అని నిర్ణయానికి వచ్చిన ఉత్తమ్, రేవంత్ ప్రచారంతో… టీఆర్ఎస్‌కు కాస్తయిన బ్రేకులు పడతాయని అంచనా వేశారు. టిఆర్ఎస్ బలం ఉన్న ప్రాంతాలలో రేవంత్ తో ప్రచారం చేయించారు. ఆ ప్రాంతాల్లో రేవంత్ కు మంచి స్పందన వచ్చింది. ఫలితాల ట్రెండ్స్‌ను చూసినా… రేవంత్ ప్రచారం చేసిన చోట టీఆర్ఎస్ మెజారిటీ కాస్త అదుపులో ఉన్నా, కాంగ్రెస్ కంచుకోటల్లో మాత్రం ఉత్తమ్ టీమ్ దారుణంగా విఫలమయినట్లు కనపడుతోంది. రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిన స్పందనతో గెలుస్తాం అన్న ధీమాలోకి ఉత్తమ్ వెళ్లిపోయారు. ప్రచారం తరువాత మీడియా సమావేశంలో రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైందని విలేకరులు అడిగితే కేవలం రేవంత్ ఏంటి సీనియర్స్ అందరూ ప్రచారం చేశారు కదా అని ఉత్తమ్ సమాధానం ఇచ్చారట, ఒక వేళ గెలిస్తే రేవంత్ కు క్రెడిట్ పోతుందేమో అని ఉత్తమ్ అలాంటి కామెంట్ చేశారు. అక్కడ కూడా ఉత్తమ్ క్రేడిట్ కోసమే పాకులాడారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.