ఒక దేశంలో ఉంటూ మరొక దేశానికి ఆడుతున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అలాంటి క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు. ధావన్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కానీ భారత జట్టుకు ఆడుతున్నాడు. అవును, నిజమే. అయితే అందుకు కారణం ఉంది.
ధావన్ పక్కా ఇండియన్. ఇండియాకే ఆడుతాడు. కానీ 2012లో అతను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషా ముఖర్జీ అనే బాక్సర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. అలాగే ఆమెకు అక్కడ సొంత ఇల్లు కూడా ఉంది. అందుకనే ధావన్ అక్కడే ఉంటున్నాడు. కానీ అతను ఇండియాకు ఆడుతున్నాడు. ఇదీ అసలు కారణం.
అయితే ధావన్ పెళ్లి చేసుకున్న ఆయేషాకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు ఆలియా, రియా. వారిని ధావన్ దత్తత తీసుకున్నాడు. అలాగే 2012లో వారికి వివాహం కాగా, 2014లో వారికి కుమారుడు జన్మించాడు. అతనికి జొరావార్ అని పేరు పెట్టారు.
ఇక 2019 జూలైలో మెల్‌బోర్న్‌లోని ఔటర్ సౌత్-ఈస్ట్ ప్రాంతంలో తమ ఇల్లు ఉన్నట్లు ధావన్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తమ క్లైడ్ నార్త్ ఇంటిని అతను తన భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి అతను షేర్ చేసుకున్నాడు. అతను తన పిల్లలు, భార్యతో అందులోనే ఉంటున్నాడు.