సింహాద్రి సినిమా తర్వాత రాజమౌళికి వచ్చిన డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసినా సరే టాలీవుడ్ జనాలు చాలా ఆసక్తికరంగా చూసారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నారు. సింహాద్రి సినిమా తర్వాత ప్రభాస్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేసారు. ఈ సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక యమ దొంగ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసారు.
Also Read:కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’
ఆ సినిమా నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీ దెబ్బకు ఇబ్బంది పడిన మెగా ఫ్యామిలీ కి ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది. ఇక మగధీర రికార్డులు ఇప్పటికీ కొన్ని పదిలంగానే ఉన్నాయనే మాట వాస్తవం. అయితే ఈ సినిమా క్రెడిట్ విషయంలో దర్శకుడు, నిర్మాత మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. సినిమా రిలీజ్ తర్వాత అల్లు అరవింద్… రాజమౌళి ని పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. దానికి కారణం కొన్ని రికార్డులే అనే మాట వినపడుతుంది.
అప్పట్లో 50 రోజులు 100 రోజులు 175 రోజుల సెంటర్ల విషయంలో అభిమానుల మధ్య పోటీ ఉండటంతో కాస్త ఫేక్ రికార్డులు చూపించే వారు. మగధీర విషయంలో అలాంటిది వద్దని… రోజుల విషయంలో సెంటర్ల విషయంలో ఫేక్ వద్దని రాజమౌళి ముందే చెప్తే దానికి అరవింద్ కూడా ఒకే అన్నారు. తీరా సిన్నిమా విడుదల అయిన తర్వాత… సెంటర్ల ప్రచారం చేసారు. దీనితో ఫ్యాన్స్ ఒత్తిడితో అలా చేయాల్సి వచ్చిందని… రాజమౌళి కి చెప్పినా ఆయన వినలేదట. ఇక తెలుగులో విడుదల అయిన నెల రోజులకు తమిళంలో విడుదల చేయమని చెప్పినా అల్లు అరవింద్ వినలేదట.
Also Read:దొంగలున్నారు జాగ్రత్త… శ్రీసింహ