వీర సింహారెడ్డి సినిమా గోపీచంద్ మలినేని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన మాట వాస్తవం. బాలకృష్ణ ఫ్యాన్ గా ఆయన చేసిన ఈ సినిమా అటు బాలయ్య ఫాన్స్ కి కూడా మంచి జోష్ ఇచ్చింది. ఈ సినిమాలో గోపిచంద్ టాలెంట్ బాగా కనపడింది. కొన్ని డైలాగులు చాలా బాగా హిట్ అయ్యాయి అనే చెప్పాలి. మరికొన్ని డైలాగులు వివాదాస్పదం అయినా కొన్ని మాత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయనకు డిమాండ్ పెరుగుతుంది. అల్లు అర్జున్ కోసం ఒక కథ సిద్దం చేసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ కథను ఇప్పటికే ఆయనకు చెప్పాడని వచ్చే ఏడాది ఆ సినిమాను విడుదల చేయవచ్చు అని అంటున్నారు. అలాగే గోపిచంద్ కి కూడా ఒక కథ చెప్పగా ఆయనకు కూడా కథ నచ్చడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత చేస్తాను అన్నారట.
ఇదిలా ఉంటే గోపిచంద్ మలినేని కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారట. డాన్ శీను సినిమా సూపర్ హిట్ అయినా ఆయన కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. వెంకటేష్ తో బాడీ గార్డ్, పండగ చేస్కో, విన్నర్ వంటి సినిమాలు చేసారు. ఇక బలుపు కెరీర్ కి బాగా ప్లస్ అయినా నిర్మాతలు మాత్రం అప్పటి వరకు సరిగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు క్రాక్ సినిమా చేయగా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాతలు ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చారట.