కొందరు హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకున్నా తర్వాత చేసే తప్పుల కారణంగా కెరీర్ నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసినా సరే అద్రుష్టం కలిసి రాక లేదంటే కొన్ని తప్పులతో సినిమా పరిశ్రమకు దూరం అవుతూ ఉంటారు. ఇలా దూరం అయిన వారిలో కీర్తి చావ్లా కూడా ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. టాలీవుడ్ లో వచ్చిన సక్సెస్ ని ఆమె క్యాష్ చేసుకోలేదు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మార్చేసిన ఆది సినిమా ఆమెకు కూడా బాగా కలిసి వస్తుందని భావించారు. నటన పరంగా అందం పరంగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఇక డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. కాని ఆమె మాత్రం వీటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత తర్వాత బరువు భారీగా పెరిగిపోయింది. దీనితో అవకాశాలు రావడం కష్టంగా మారింది.
కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా చిన్న చిన్న పాత్రలే కావడంతో కాస్త ఇబ్బంది పడింది. కాని బరువు తగ్గడానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడలేదు. దీనితో ఆమెను మన సౌత్ లో అసలు పట్టించుకోలేదు. వాస్తవానికి ఆమెకు ఉన్న గ్లామర్ అప్పట్లో ఏ హీరోయిన్ కి లేకపోయినా సరే ఆమె సరిగా కెరీర్ ను ప్లాన్ చేసుకోలేదు. మన్మధుడు సినిమాలో కనపడినా అది కొంచెం సేపు మాత్రమే. ఇలా బరువు కారణంగా సినిమాలకు దూరం అయింది.