సెంటిమెంట్ ల విషయంలో కొందరు జాగ్రత్తగా ఉంటారు. ఎలా పడితే అలా వ్యవహరించకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారీ వ్యాపారాలు చేసే ప్రముఖులు అయితే ఈ విషయంలో కాస్త అలెర్ట్ గా ఉంటారు. అందులో లలితా జ్యూవేలరి అధినేత కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన మహానటి సావిత్రి ఇల్లు కొనడం సంచలనం అయింది. దీనిపై ఆయన స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.
Also Read:హైదరాబాద్ లో మటన్ బిర్యానీ తింటున్నారా..అయితే జాగ్రత్త!
ఎంతో ఇష్టంతో మహానటి సావిత్రి బిల్లింగ్ ని కొన్నట్లు కిరణ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సావిత్రి పిల్లలు ఒక అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ లో కిరణ్ కుమార్ అద్దెకు ఉండేవారు. ఆ బిల్డింగ్ ని అమ్మాలి అని సావిత్రి కుటుంబ సభ్యులు అనుకున్న సమయంలో తనకు బాగా కలిసి వచ్చింది అనే సెంటిమెంట్ తో ఆ బిల్డింగ్ ని ఆయన కొనుక్కున్నారు. ఇక దీనిపై సావిత్రి కుమార్తె కూడా అసలు విషయం చెప్పారు.
సావిత్రికి బంగారం అంటే పిచ్చి అని చెప్పారు. ఇక కిరణ్ కుమార్ ది బంగారు షాపు అని… అలాగే అమ్మకి కార్లు అంటే చాలా పిచ్చి ఆ పిచ్చి కిరణ్ కుమార్ గారికి కూడా ఉందని అన్నారు. సావిత్రిని ఆయన అక్క అని పిలుస్తారట. అందుకనే ఇంటిని ఆయనకు అమ్మినట్టు చెప్పారట. సావిత్రి ఇల్లు కూడా తన సక్సెస్ కి కారణం అని కిరణ్ అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా ఈ ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్.