ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కాస్త జోష్ లో ఉన్నాడు. అమెరికాలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆస్కార్ అందుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉన్నా ఎన్టీఆర్ మాత్రం అక్కడి నుంచి వచ్చేసాడు. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. టీం అంతా అక్కడే ఉంటే ఎందుకు ఎన్టీఆర్ ఇండియా వచ్చాడు అనే దానిపై ఇప్పుడు ఒక అభిప్రాయం ఉంది.
ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ తో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయింది. త్వరలోనే ఎన్టీఆర్ తో చేసే సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉంది. ఇందుకోసం కొన్ని విధాలుగా స్క్రీన్ టెస్ట్ కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కొరటాల శివ ఒక హాలీవుడ్ డిజైనర్ ని కలవనున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ రావాల్సి వచ్చింది అంటున్నారు.
అలాగే బుచ్చి బాబుతో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా లైన్ లో పెట్టాడు. అదే విధంగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా లైన్ లో ఉంది. కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉంటే సమయం వృధా అవుతుందని భావిస్తున్నాడని వచ్చి వెంటనే షూటింగ్ మొదలుపెడితే బెస్ట్ అనుకుని వచ్చేసాడని సమాచారం. ఇండియా వచ్చిన ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కం లభించింది.