పోసాని కృష్ణ మురళి రచయితగా నటుడిగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో మంచి మాటలు రాసి తక్కువ టైం లోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడిగా ఆయన బిజీగా ఉన్నారు. అటు రాజకీయాల్లో కూడా ఆయన సీరియస్ గానే ఫోకస్ చేసారు. వచ్చే ఎనికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. గుంటూరు జిల్లా నుంచి ఆయన పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఉంది.
ఇక దర్శకుడిగా కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక యువ హీరోతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారని పోసాని కృష్ణమురళి అన్నారు. మా నాన్నకు మొదట ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలిపారు.
అయితే మా నాన్నకు ఎవరో పేకాట నేర్పారని ఊళ్లో ఎవరో ఒకరు ఎందుకు సుబ్బారావు ఈ విధంగా చేస్తావు కదా అని అడిగారని అలా అడగటం వల్ల ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారని గుర్తు చేసుకున్నారు. నాన్న పొలానికి వెళ్లి చనిపోయారని తెలిపారు. ఇక పోసాని రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆయన సినిమాకు పది నుంచి 15 లక్షల వరకు తీసుకుంటున్నారు.