టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్ గా ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు అయినా సరే తన పాత్ర బాగాలేదు అంటే మాత్రం ఆమె చేసే అవకాశం లేదు. ఇక స్కిన్ షో విషయంలో మాత్రం ఆమె ఎవరి మాట వినే అవకాశమే లేదు. ఇక డాన్స్ కూడా ఎలాంటి కష్టమైనా సరే ఆమె వెనక్కు తగ్గే అవకాశమే లేదు.
రెమ్యునరేషన్ కాదు, అవకాశాలు కాదు తన పాత్ర గుర్తొస్తే తనకు మంచి జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉండాలని చెప్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో సైతం ఆమె ఇదే విషయాన్ని చెప్పింది. సాయి పల్లవికి స్టార్ హీరోలతో చేసే అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం కొన్ని విషయాలు నచ్చక వద్దని చెప్పారు. అలాంటి సినిమానే జైలవకుశ. ఆ సినిమాలో నివేథా థామస్ పాత్రకు ఆమెను అడిగారు.
అన్నీ ఒకే అయినా తన పాత్ర తనకు నచ్చలేదు అని అందులో ప్రాధాన్యత లేదని అందుకే తాను చేయడానికి ఇష్టపడటం లేదని చెప్పిందట. కథలో మార్పులు చేసినా సరే నో అనడంతో దర్శకుడు మరో హీరోయిన్ ని ఎంపిక చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయి పల్లవి రెండు తెలుగు సినిమాలకు సంతకం చేసింది. ఈ సినిమాలు జూన్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.