శ్రీను వైట్ల దర్శకుడిగా మంచు విష్ణు హీరోగా వచ్చిన చిత్రం ఢీ. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో కామెడి ఇప్పటికి కూడా జనాలను నవ్విస్తుంది. ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టని కామెడి ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడికి ఫాన్స్ ఉన్నారు. సునీల్… కూడా చాలా బాగా నవ్వించాడు. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర చాలా బాగా హిట్ అయింది.
శ్రీహరి రౌడీగా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో పాజిటివ్, నెగటివ్ రెండూ ఉండే విధంగా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. అందులోనే కామెడి కూడా పండించాడు. హీరోయిన్ అన్నయ్యగా శ్రీహరి నటన చాలా బాగుంటుంది అయితే ఈ పాత్ర వెనుక మరో కారణం ఉంది అంటారు. అంబర్ పెట్ శంకర్ అనే వ్యక్తి ఆధారంగా ఆ పాత్ర రెడీ చేసారు అని ఆయన అంటే శ్రీను వైట్లకి అభిమానం అని అంటారు.
ఇక ఆ పాత్ర శ్రీహరితో చేయించడం వెనుక కారణం ఏంటీ అంటే… తెలంగాణా యాస కూడా శ్రీహరి బాగా మాట్లాడతాడు. హైదరాబాద్ లో ఉండే పహిల్వాన్ లా శ్రీహరి కనపడతారు. అందుకనే ఆ పాత్రను అలా డిజైన్ చేసారని అంటారు. అంబర్ పెట్ శంకర్ తో శ్రీహరికి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీహరిని ఆయన తమ్ముడు అని కూడా అంటారు. అందుకనే ఈ పాత్రకు శ్రీహరి ఓకే చెప్పారని అంటారు.