సినిమా పరిశ్రమలో మల్టీ స్టారర్ కి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. యువ దర్శకుల నుంచి అగ్ర దర్శకుల వరకూ అందరూ మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని కలలు కంటూ ఉంటారు. గతంలో అయితే ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు వంటి వారు మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా చేసేవారు.
Also Read:కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్…నిలకడగా లాలూ ఆరోగ్యం….!
చిరంజీవి కూడా అలాంటి సినిమాలు చేసారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన కెరీర్ లో అదొక లోటు అంటారు. ఇక బాలయ్య కెరీర్ లో ఒక మంచి మల్టీ స్టారర్ పడేది గాని ఒక కారణంతో ఆగిపోయింది. ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన గుండమ్మ కథ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాను మళ్ళీ తమ కొడుకులతో చేయించాలి అని వాళ్ళు భావించారు.
ఎస్వీ రంగారావు పాత్రకు గాను గుమ్మడిని సెలెక్ట్ చేసారు. సినిమా కథలో ఏ విధమైన మార్పులు లేవు. కేవలం నటులు, పాటలు మాత్రమే మారతాయి. కాని ఒక పాత్ర మాత్రం ఈ సినిమాలో హైలెట్. ఆ ఒక్క పాత్ర సరిగా దొరికితే సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది. ఆ పాత్రే సూర్యకాంతం పాత్ర. గుండమ్మ కథ సినిమా అంటే కనపడే రూపమే సూర్యకాంతం. అలాంటి పాత్రను ఎవరితో చేయించాలి అనుకున్నారు… బాలకృష్ణ దాదాపు నెలకు పైగా స్క్రీన్ టెస్ట్ లు చేసారట. కాని సూర్యకాంతం దరిదాపులకు కూడా ఎవరూ రాలేదు. ఆ సినిమాలో హైలెట్ కావాల్సిన పాత్రే సరిగా లేకపోతే సినిమాకు ప్రాణం ఉండదు అని ఆగిపోయారట.