కొన్ని సినిమాలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందులో ఆనందం సినిమా ఒకటి. ఈ సినిమా కథ, సినిమా టేకింగ్ అన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 2001 లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది రికార్డులు సృష్టించింది. పది కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ ఏడాది సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీను వైట్ల ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడిగా మారిపోయారు అనే చెప్పాలి.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఆకాష్, రేఖ నటించారు. ఆ ఇద్దరి కెరీర్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పాలి. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు ముందు హీరో హీరోయిన్లుగా వేరే వాళ్ళను అనుకుంది చిత్ర యూనిట్. ముందు ఉదయ్ కిరణ్, శ్రేయని తీసుకోవాలని భావించారు నిర్మాత రామోజీ రావు. చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల కూడా వాళ్ళనే తీసుకోవాలని చూసారు.
కాని అప్పటి వరకు శ్రేయతో నాలుగు సినిమాలు చేసింది ఉషా కిరణ్ మూవీస్. ఉదయ్ కిరణ్ తో కూడా సినిమాలు చేసింది. అందుకే ఈ సినిమాకు కొత్త హీరోని తీసుకోవాలి అనుకుని ఆకాష్ ని, రేఖ ని ఎంపిక చేసారు. లేదంటే ఈ హిట్ ఉదయ్ కిరణ్ ఖాతాలో పడాల్సింది. ఈ సినిమా కంటే ముందు కన్నడంలో రేఖ ఒక సినిమా మాత్రమే చేసారు. తెలుగులో ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.