భీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్య గా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హీరోయిన్ నిత్యా మీనన్ రాలేదు. నిజానికి చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. అదీ కాక పవన్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే అసలే వదులుకోరు.
కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ ఈవెంట్ ను నిత్యామీనన్ మిస్ అయింది. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రకరకాలుగా చర్చలు మొదలు పెట్టారు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్రను నిత్యాకి ఇచ్చారు. కానీ ఆమె ఎందుకు రాలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇక నిత్యా ప్రస్తుతం స్వాగత వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ షూటింగ్ షెడ్యూల్ కారణంగానే నిత్యామీనన్ రాలేకపోయినట్టు తెలుస్తోంది.
మరోవైపు పవన్ కూడా నిత్యా మీనన్ యాక్టింగ్ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొన్ని మాటల చెప్పటంతో టీంకి నిత్యాకు ఎలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీతో ఉన్నారు ఫ్యాన్స్.