సినిమా పరిశ్రమలోకి ఒకసారి వచ్చిన తర్వాత తమ వారసులను కూడా తీసుకురావాలని తపిస్తూ ఉంటారు. కూతురు అయినా కొడుకు అయినా సరే అలాగే కష్టపడుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకూ అందరూ ఇలాగే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ కూడా తన కుమార్తెలను హీరోయిన్లను చేసే ప్రయత్నం చేసి కొంత వరకు విజయవంతం అయ్యారనే చెప్పాలి.
అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం తన కుమార్తెలను సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కొడుకుని కూడా సినిమాల్లోకి తీసుకురాకుండా ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కుమార్తెలు ఇద్దరూ వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు సినిమాల్లోకి రాలేదు అనేది చూద్దాం. మొదటి కుమార్తె బ్రాహ్మణికి సినిమాలు అంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదట.
అందుకే ఆమె ముందు నుంచి బిజినెస్ వైపే ప్రయత్నం చేస్తూ చివరిగా అటు వైపే విజయం సాధించారు. ఇప్పుడు అత్తారింటి వ్యాపారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక చిన్న కుమార్తెకు సినిమాలు అంటే ఇష్టం గానే ఉన్నా… సినిమాల్లో నటనకు మాత్రం ఇష్టపడలేదు. కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేయడానికే ఆమె ఆసక్తి చూపించారు. ఇక బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా సినిమాల వైపు వద్దనే చెప్పేవారట. దీనితో బాలకృష్ణ కుమార్తెలు సినిమాల్లోకి అడుగు పెట్టలేదు. ఇక పెద్ద కుమార్తె బ్రాహ్మణి బాలకృష్ణ సినిమాలు మాత్రమే చూస్తారట.