సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్ళు గా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గత వారం కన్నుమూసారు. ఇక ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మహేష్ బాబు, సితార ఇద్దరూ ఏడ్చిన విధానం అందరిచేత కన్నీళ్లు పెట్టించింది.
కృష్ణ… విజయ నిర్మల ని వివాహం చేసుకున్న తర్వాత పెద్ద కొడుకు రమేష్ బాబు వద్ద ఆమె ఉన్నారు. ఇదిలా ఉంచితే… ఆమె మరణించిన తర్వాత ఘట్టమనేని కుటుంబం మొత్తం వచ్చినా ఒక కీలక వ్యక్తి మాత్రం రాలేదు. అతనే మహేష్ బాబు కుమారుడు గౌతం. నానమ్మతో గౌతం కి, సితారకి మంచి బాండింగ్ ఉంది. సెలవలు వచ్చిన ప్రతీసారి నానమ్మ వద్దకు వెళ్తూ ఉంటారు.
అలాంటిది గౌతం రాకపోవడానికి కారణం ఏంటి అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. దానికి కారణం గౌతం విదేశాల్లో ఉండటమే. ఉన్నత చదువుల కోసం గౌతం విదేశాలకు వెళ్ళాడు. అప్పుడు మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. ఇక గౌతం రావడానికి సమయం కూడా లేకపోయింది. మరణించిన గంటల్లోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనితో ఆమె దగ్గరి బంధువులు కూడా చివరి చూపుకి నోచుకోలేకపోయారు.