సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా కోసం ఫాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే ఆ లెవెల్ వేరేలా ఉంటుంది. స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు ఉంటాయి. అయితే టాలీవుడ్ లో ఒక కాంబినేషన్ మాత్రం ఫాన్స్ ఎదురు చూస్తున్నా సరే పడటం లేదనే ఆవేదన ఉంది.
ఆ కాంబినేషన్ ఏంటీ అనేది చూస్తే… ప్రభాస్, సమంతా కాంబినేషన్. వీళ్ళు ఇద్దరికీ మంచి ఇమేజ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కలిసి సినిమా చేయలేదు. ప్రభాస్ ఎక్కువగా అనుష్క, పూజ హెగ్డే, నయనతార, శ్రేయలాంటి హీరోయిన్స్ తో సినిమాలు చేసాడు. మరి సమంతాతో ఎందుకు చేయలేదు అంటే ఇద్దరికీ మధ్య హైట్ ప్రాబ్లం. సమంతా ప్రభాస్ పక్కన సెట్ కాదని దర్శకులు ఒప్పుకోలేదు.
మిర్చీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకుందామని చూస్తే ప్రభాస్ నో చెప్పాడని అందుకే రిచాను తీసుకున్నారు అని టాక్. ఏది ఎలా ఉన్నా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడాలి అనేది ఫాన్స్ కోరిక. ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా హీరోయిన్ ఫిక్స్ అయింది. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ను ఎవరు సెట్ చేస్తారో చూడాలి.