ఎవరైనా నిద్రలో పళ్ళు కొరికితే పక్కన ఉన్న వారికి తలనొప్పిగా ఉంటుంది. ఆ సమస్యను అధిగమించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కొందరు. కాన్ నిద్రలో ఉన్న వాళ్ళు పళ్లు కొరకడానికి కారణం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు కొరకకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి. నిద్రలో పళ్ళు కొరికితే కచ్చితంగా ఒత్తిడికి గురవుతున్నారు అనేది ప్రధాన కారణం.
Also Read:షెహ్నాజ్ ట్రెజరీకి ప్రోసోపాగ్నోసియా వ్యాధి.. ఇది సోకితే అది తప్పదు..!
ధ్యానం చేస్తే ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ఇక ఇలా కొరుకుతూ పోతే ఒకోసారి పళ్ళ అమరికలో తేడాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పళ్ళ అమరికలు మారడానికి మరో కారణం మనం వాడే స్టెరాయిడ్స్ కూడా. అవి మన శరీరం స్థితిని మారుస్తాయి. ఇక డెంటిస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎత్తు పెంచినప్పుడు కూడా సమస్య ఉంటుంది.
చిన్న పిల్లల్లో పడుకున్నప్పుడు పళ్ళు కొరకడాన్ని స్లీప్ బ్రక్సిజం అని పిలుస్తారు. చిన్నపిల్లలో ఇది కామన్ సమస్య. ఎక్కువగా రాత్రులందు పిల్లలు పళ్ళు కోరుకుతూ పళ్ళు బిగించడం అనేది మూడు కారణాలతో జరుగుతుంది. ఒకటి సైకలాజికల్, రెండు జెనేటికల్, మూడు వేరే వాళ్ళను చూసి అలా చేయడం. మూడవది క్రమంగా అలవాటుగా మారుతుంది. అయితే ఇవి కొంత వయసు వచ్చేసరికి తగ్గిపోతాయి. కాబట్టి దానికి ఎటువంటి చికిత్స అవసరం లేదు. పెద్దవారికి కొన్ని వారాలపాటూ వాడగలిగే మందు హోమీయోలో ఉంటుంది. చిన్న పిల్లలు నిద్రలో పళ్ళుకొరకడం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారు.
Also Read:విద్యార్థులారా.. ఆత్మహత్యలొద్దు!