రైలు ప్రయాణాన్ని ఎక్కువగా అబ్బాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతీ చిన్న విషయంలో ఎంజాయ్ చేసే అబ్బాయిలు రైలు ప్రయాణాన్ని మరింతగా ఎంజాయ్ చేయడానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది అబ్బాయిలు ట్రైన్ డోర్ వద్ద కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా కూర్చుంటారు అంటే దానికి బలమైన కారణమే ఉంది అంటున్నారు కొందరు నిపుణులు.
Also Read:సీబీఐ విచారణతోనే న్యాయం
హార్మోనుల ప్రభావం టీనేజులో, యుక్తవయసులో చాలా ఉదృతంగా ఉంటుందట. ఒకరి మీద ఆధారపడి లేమని చెప్పడానికి… అలాగే… ఒకరి చెప్పు చేతల్లో లేమని, సర్వ స్వతంత్రులమని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా… తమ ఇష్టం వచ్చినట్టు తాము ఉంటామని నిరూపించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాంగత్యాన్ని బట్టి ఆ ప్రయత్నాలలో ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి.
అలాగే గుంపులో ఒకరిమి కాదని చెప్పటానికి తమకో స్పేస్ కోరుకుంటారు కొందరు. అందువల్లనే… కూర్చోవటానికి అవకాశం ఉన్నా కూడా ట్రైన్ డోర్ వైపుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక మరో బలమైన కారణం ఉంది. అబ్బాయిలకు ఓపిక తక్కువగా ఉంటుంది. ఎక్కడో వెనక గుంపులో ఉంటే తాము దిగేటప్పుడు సమయం పడుతుందనే ఆలోచన కూడా ఉంది. డోర్ దగ్గర కూర్చుంటే వెంటనే దిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే భావనలో భాగంగా అలా చేస్తారు. అలాగే సహనం, నిదానం, ఆలోచన ఆ వయసులో తక్కువ. ఎవరో ఒకరికి ఇద్దరికీ ఉంటుంది. ఇక అక్కడ కూర్చుంటే అన్ని ప్రాంతాలను దగ్గరగా చూడవచ్చు అనే భావనలో ఉంటారు.
Also Read:బ్రేకింగ్.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్