బ్రాహ్మణుల ఆహార నియామాలు ఇతరులతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. దేవుడికి నైవేద్యం సమర్పించగలిగే వస్తువులను మాత్రమే వాళ్ళు ఆహారంగా తీసుకుంటారని చెప్తారు. ఈ క్రమంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటిని ఆహారంగా తీసుకోకుండా ఉంటారు. అసలు ఈ పద్ధతి ఎందుకు ఏంటీ అనేది చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. సల్ఫర్ కు ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది.
Also Read:దేవాలయాల్లో హనుమంతుడి శరీరానికి సింధూరం ఎందుకు రాస్తారు…?
అందుకే తీవ్రమైన వాసన కలిగి ఉంటుంది. అలాగే కొందరికి నాలుక మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణ వృత్తి ప్రధానంగా మంత్రోచ్ఛారణ, వేద పారాయణం కాబట్టి… దీనికి మంచి ఉచ్ఛారణ అవసరం ఉంటుంది. అందుకే నాలుక మీద ప్రభావం చూపించే ఉల్లి, వెల్లుల్లికి వారు దూరంగా ఉంటారు. ఇక మరో కారణం చూస్తే… వారు దుర్వాసన రాని ఆహార పదార్ధాలు అంటే సాత్విక ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకుంటారు.
ఉల్లి తిన్న తర్వాత నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఉల్లి కారణంగా చెమట వాసన కూడా వస్తుంది. అందుకే వాళ్ళు ఉల్లికి ఎక్కువగా దూరంగా ఉంటారు. ఇక అతిగా వాసన వచ్చే పుదినాను కూడా వాళ్ళు నిషేధించారు. ఈ రోజుల్లో కొందరు రుచికి ప్రాధాన్యత ఇచ్చి తింటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. నోట్లో నుంచి వాసన వస్తే గనుక… మంత్రాలను మర్చిపోతారని పూర్వం భావించేవారట. బ్రాహ్మణులనే కాదు, ఇస్కాన్ భక్తులు.. ఇలా మరి కొందరు కూడా ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఇక ఉల్లి తింటే కోరికలు కూడా పెరిగే అవకాశం ఉందనే భావన ఉంది. అందుకే వాళ్ళు ఉల్లికి దూరంగా ఉంటారట.
Also Read:మునుగోడు తీర్పు .. తెలంగాణలో మార్పుకు నాంది కావాలి