తుమ్మడం అనేది కొందరికి సిగ్గు, మరికొందరికి ఉపశమనం. తుమ్ము వస్తే పక్కన వారు ఏమైనా అనుకుంటారేమో అనే భయంతో కొందరు తుమ్మడం ఆపేసి ఇబ్బంది పడతారు. అసలు తుమ్ము ఎందుకు వస్తుందో చూద్దాం. నాసికా రంధ్రాల్లో కానీ, కోశాల్లో కానీ ఏదయినా అంతరాయం కలిగినా లేదంటే… నాసికా కండరాలు ఎక్కువగా స్రవించినా సరే ఆ విధంగా ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు శరీరం తీసుకునే చర్యను తుమ్ము అని పిలుస్తారు.
Also Read:పూజారికి, పండిట్ కి తేడా ఏంటీ…?
దీని ద్వారా ఊపిరితిత్తులలో ఉండే గాలి ముక్కుల ద్వారా బలంగా బయటకు వెళ్తుంది. ఫలితంగా ముక్కుల్లో ఉన్న అనవసర పదార్దాలు బయటకు వచ్చేస్తాయి. తుమ్మే ముందు గొంతు, నోటిలోని కండరాలు, శ్వాస స్వల్పంగా స్తంభించడం జరుగుతుంది. ఆ సమయంలో కనురెప్పలు కూడా మూసుకుంటాయి. అందుకనే తుమ్మినప్పుడల్లా పెద్దవారు చిరంజీవ అని దీవించే వారు.
విల్స్ అనే ఒక శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధన ప్రకారం తుమ్ము వేగం షుమారు గంటకు 160 కిలోమీటర్లు ఉంటుంది. క్రికెట్ లో అత్యంత వేగంగా విసిరే బంతితో సమానం. అయితే ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో… తుమ్ము గరిష్టంగా మహా అయితే గంటకు 30కి ఉండదు అని వెల్లడి అయింది. తుమ్మినపుడు తుంపరలు మాత్రం 8 మీటర్ల వరకు వెళ్తాయి. తుమ్మె సమయంలో ముక్కు మూసుకుంటే కచ్చితంగా… తలలో రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ వేగాన్ని మన శరీరం కట్టడి చేయాలనుకుంటే నష్టం తీవ్రంగానే ఉంటుంది.