కళ్ళు అనేవి మన శరీరంలో అత్యంత ముఖ్యం. కళ్ళు లేని వాళ్ళ జీవితాలను మనం చూస్తే వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ఇక కళ్ళకు సంబంధించి మనకు అనేక సందేహాలు ఉన్నాయి. కళ్ళు నలిపిన సమయంలో మనకు కనపడే రంగులు, నిద్రలో కొందరు కళ్ళు తెరిచి నిద్రపోవడం, కళ్ళ కలకలు, కంట్లో ఉండే ఎర్రటి చుక్కలు ఇలా అనేక విషయాలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి.
Also Read:హైదరాబాద్ రూపురేఖలు మారుస్తాం..!
అలాంటి ఒక సందేహం ఏంటీ అంటే… మనము మన కళ్ళను నలిపినప్పుడు గాని కంటికి ఏదైనా సడెన్ గా దెబ్బ తగిలినప్పుడు గాని విచిత్రమైన రంగులు, నమూనాలు ఎందుకు కనిపిస్తాయి? కాస్త సున్నితంగా వేళ్ళతో కళ్ళపై ఒత్తినా నులిమినా కొన్ని క్షణాలకు చక్రాలు, వలయాలు తిరుగుతున్నట్టున్న ఆకృతులు మనకు కనపడుతూ ఉంటాయి. అసలు అలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
ఈ విషయాన్ని శాస్త్రీయ పరిభాషలో ఫాస్ఫీన్(phosphene) అని పిలుస్తారు. కంట్లోని రెటీనా మీద వెలుగు ఉన్న మిథ్యను కలుగచేస్తుంది. కంటి మీద కలిగించిన అప్పటి ఒత్తిడి స్థాయిని బట్టి ఈ రంగులు కొన్ని క్షణాల నుంచి నిమిషం వరకు కనపడతాయి. అంతకు మించి కనపడితే కన్ను గాల్లో కలిసిపోయినట్టే. ఆ తరువాత నెమ్మదిగా అవి మాయమై గాఢాంధఃకారం అలుముకుని కాసేపు వింతగా ఉంటుంది. కళ్ళు, మెదడు కూడా శాంతించినట్టుగా తెలుస్తుంది. ధ్యానానికి ముందు ఇలా ఒక నిముషం చేస్తే కొందరికి మనసు కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. సూర్యుడ్ని డైరెక్ట్ గా చూసినా మనకు అలాంటి అనుభూతే కలుగుతుంది.
Also Read:హాస్టల్ లో విద్యార్ధిని అనుమానాస్పద మృతి..!