మనిషి జీవితంలో కుక్కకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కుక్కను సొంత మనిషి కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక కుక్కలు చేసే పనులు కూడా మనకు ఆశ్చర్యంగానే ఉంటాయి. అలాంటి పనే కుక్కలు పడుకునే ముందు గుంతలు తవ్వడం. అవి పడుకునే ముందు రెండు మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణలు చేస్తుంటాయి. అదే విధంగా ఏదైనా దొరికితే చిన్న గొయ్యి తీసి పాతిపెట్టడం అలాగే ఆ గొయ్యిలో పడుకోవడం లాంటివి చేస్తాయి.
Also Read:నాతో వాళ్లు బాడీ మసాజ్ చేయించుకున్నారు…!
కుక్కను మనిషి ఎంత దగ్గర చేసుకున్నా సరే… కుక్కలు వాటి అరణ్య జీవనాన్ని అంటే గతాన్ని మర్చిపోలేదు. మనుషులు అభివృద్ధి మాయలో లక్షణాలు వదిలేసినా కుక్కలు మాత్రం వాటి జాతి లక్షణాలు మర్చిపోలేదు. వాటికి ఎంత లగ్జరీ లైఫ్ ఇచ్చినా అవి చేసే పనులు చేస్తున్నాయి. తోడేళ్ళూ, నక్కలూ, కుక్కలకు అక్కాచెల్లెళ్ళ వరుసగా చెప్తారు. ఉమ్మడి జంతువుల నుండి ఈ జంతువులు పరిణామం చెందినట్టు జీవ శాస్త్రజ్ఞుల అంచనా వేసారు.
అడవిలో అవి పడుకునేటప్పుడు అవి పడుకునే ప్రదేశాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తాయి. ముళ్ళు, పురుగులూ ఉన్నాయో లేదా అనేది చూసుకుని పడుకుంటాయి. మెత్తటి పరుపు మీద పడుకోబెట్టినా సరే అవి అదే విధంగా నిద్రపోతాయి. ఇక గోతులు తీసుకుని ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. అవి అడవుల్లో ఉన్న సమయంలో ఆహార అన్వేషణ కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండేది. ఆ సమయంలో దొరికిన ఆహారాన్ని దాచుకుని తినేవి. ఇక అర్ధరాత్రి వేళ చంద్రుడి వంక చూస్తూ మెడ ఎత్తి అరుస్తుంది. అవి అడవి జంతువులుగా ఉన్న సమయంలో మిగిలిన కుక్కలని వేటకు పిలవడానికి అలా అరిచేవి.
Also Read:సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?