చాలా మంది టీ తాగే ముందు నీళ్ళు తాగుతూ ఉంటారు. ఏ టీ షాప్ దగ్గర చూసినా సరే ఇటువంటి దృశ్యం కనపడుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలియకుండానే తాగుతూ ఉంటారు. కారణం ఏంటో చూద్దాం. టీ తాగే ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగితే… కడుపులోని ఆమ్ల స్థాయిలను దాదాపుగా తగ్గిస్తుంది. ఏ పదార్ధం తీసుకున్నా సరే… దానికి ఉండే పీహెచ్ విలువ ఆమ్ల స్థాయిలను సూచిస్తుంది.
Also Read:చికోటి చీకటి వ్యాపారం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
టీలో పీహెచ్ వాల్యూ అనేది ఆరు వరకు ఉంటుంది. టీ అనేది ఒకరకంగా ఆమ్లం. టీలో నీటి పీహెచ్ విలువ 7 తటస్థంగా ఉంటుంది. మీరు అధిక పిహెచ్ స్థాయి కలిగిన పానీయాలను తీసుకునే సందర్భంలో గుండెల్లో మంట, కడుపులో ఉండే గోడలు దెబ్బతినడం, పెద్దప్రేగు క్యాన్సర్ మొదలైన ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. టీ కి ముందు ఒక గ్లాసు నీరు తాగడంతో యాసిడ్ ఉత్పత్తి అరికడుతుంది.
యాసిడ్ స్థాయిలను పలుచన చేయడమే కాకుండా పొట్టలో జరిగే నష్టాన్ని కూడా దాదాపుగా అధిక ఆమ్ల స్థాయి కారణంగా దంతాలపై టీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. మనం తాగే నీళ్ళ కారణంగా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. నీళ్ళు సరిపడా తాగడం అనేది చాలా మంచిది. టీ తో పాటుగా కాఫీలో కూడా పీహెచ్ వాల్యూ 5 ఉంటుంది. ఇది కూడా ఆమ్ల పరిధిలోకే వస్తుంది. కాబట్టి కాఫీ తాగినా సరే నీళ్ళు తాగడం మంచిది. మనం తాగే కూల్ డ్రింక్ లో పీహెచ్ విలువ 2.5 వరకు ఉంటుంది. దాని నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక గ్లాస్ కూల్ డ్రింక్ కి కనీసం 30 గ్లాసులు నీరు తాగాలని నిపుణులు చెప్తున్నారు.
Also Read:సోనియా ఎందుకు క్షమాపణలు చెప్పాలి..?